కరోనా వైరస్ కారణంగా మార్చి నుంచి ప్రారంభమైన లోన్ల మారిటోరియం మరోసారి పెంచే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఈ విషయాన్ని సుప్రీం కోర్ట్ కి కేంద్ర ప్రభుత్వం నేడు తెలిపింది. లోన్ మారిటోరియం పై నేడు సుప్రీం లో విచారణ జరిగింది. దీనిపై కేంద్రం సుప్రీం కి ఒక వివరణ ఇచ్చింది. మారటోరియం మార్చి 2021 వరకు కొనసాగిస్తామని కేంద్రం తరుపున సొలిసిటర్ జనరల్ సుప్రీం దృష్టికి తీసుకెళ్ళారు.
దీనికి అంగీకరించిన సుప్రీం… కట్టడి ఈఎంఐలు, అదే విధంగా ఈ సమయంలో కట్టాల్సిన ఈఎంఐ లకు ఏ విధమైన వడ్డీలు విధించవద్దు అని స్పష్టం చేసింది. ప్రతిపక్షాలు కూడా తమ వాదనలను వినిపించాలని సూచించింది సుప్రీం కోర్ట్. రెండేళ్ల మారటోరియంపై కసరత్తు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కి స్పష్టం చేసింది.