చండీగఢ్ ప్రైవేట్ యూనివర్సిటీలో విద్యార్థినుల న్యూడ్ వీడియోల లీక్ ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. విద్యార్థినుల న్యూడ్ వీడియోలు సోషల్ మీడియాలో లీక్ అవ్వడంతో వర్సిటీ ఆందోళనలతో దద్దరిల్లింది. తమ ప్రైవేట్‌వీడియోలు సోషల్ మీడియాలో పెట్టారంటూ వర్సిటీలోని మహిళా విద్యార్థినులు శనివారం అర్ధరాత్రి ఆందోళనకు దిగారు.
ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. చండీగడ్ వర్సిటీ విద్యార్థిని, ఆమె ప్రియుడిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అరెస్టయిన ఇద్దరు హిమాచల్‌ప్రదేశ్‌లోని రోహ్రూ వాసులుగా గుర్తించారు. మరో 31ఏళ్ల వ్యక్తిని సైతం హిమాచల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తమతో పాటే హాస్టల్లో ఉంటున్న ఓ విద్యార్థిని.. తాము బాత్రూముల్లో స్నానాలు చేస్తుండగా వీడియోలు తీసిందని విద్యార్థినులు ఆరోపించారు. ఈ వీడియోలను ఆమె.. తన స్నేహితుడికి పంపగా, అతడు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసినట్లు వెల్లడించారు. ఈ ఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలంటూ.. వర్సిటీ ప్రాంగణంలో పెద్దఎత్తున ఆందోళన చేశారు.