వచ్చే వారమే కేంద్ర కేబినెట్లో మార్పులు !

-

కేంద్ర మంత్రి వర్గ విస్తరణ పై ప్రసార మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. త్వరలో కొన్ని రాష్ట్రాల బిజేపి అధ్యక్షుల నియామకం పై నిర్ణయం తీసుకొనున్నారు. కేంద్ర మంత్రివర్గం లో కూడా మార్పులు చేర్పులు జరుగునున్నాయట. వచ్చే శుక్రవారం వరకు కర్నాటక, తెలంగాణ, మహారాష్ట్ర పర్యటనలో రాష్ట్రపతి ఉంటారు. జూలై 7 తర్వాతనే ఢిల్లీకి తిరిగి రానున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఈ వారాంతంలో కేంద్ర మంత్రివర్గం లో మార్పులు, చేర్పులు ఉండే అవకాశం ఉందట.

వచ్చే శని, ఆదివారం నాడు కేంద్ర మంత్రివర్గం విస్తరణ ఉండే అవకాశం ఉందని సమాచారం.
లేకపోతే, ఆగస్టు 11 న వర్షాకాల సమావేశాలు ముగిసిన తర్వాతనే క్యాబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉందట. జూలై 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగనున్నాయి. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో, కొత్తగా బాధ్యతలు చేపట్టే మంత్రులకు ఆయా శాఖలపై అవగాహన కలగేందుకు సమయం ఉండాలనే ఆలోచనలో అధికార బిజేపి అగ్రనాయకత్వం ఉంది. బిజేపి సంస్థాగత మార్పులతో పాటు, కేంద్ర మంత్రివర్గంలో కూడా ఒకేసారి మార్పులుంటాయని సమాచారం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news