త‌గ్గుముఖం ప‌డుతున్న క‌రోనా.. నేడు ఇండియా లో 2.51 ల‌క్షల కేసులు

-

భార‌త దేశంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి కాస్త శాంతిస్తుంది. గ‌తంతో పోలిస్తే.. క‌రోనా కేసులు గ‌ణనీయంగా తగ్గుతున్నాయి. థ‌ర్డ్ వేవ్ కార‌ణంగా గ‌త కొద్ద రోజుల నుంచి రోజుకు మూడు ల‌క్షలకు పైగా క‌రోనా కేసులు న‌మోదు అవుతుండేవి. కాగ తాజా గా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుద‌ల చేసిన క‌రోనా బులిటెన్ ప్ర‌కారం గురువారం దేశ వ్యాప్తంగా 2,51,209 క‌రోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. కాగ నిన్న దేశంలో 2.86 ల‌క్షల క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి.

అంటే నిన్న‌టితో పోలిస్తే.. దాదాపు 30 వేల క‌రోనా కేసులు త‌గ్గాయి. కాగ గ‌డిచిన 24 గంట‌ల‌లో దేశ వ్యాప్తంగా 627 క‌రోనా మ‌ర‌ణాలు సంభ‌వించాయి. అయితే క‌రోనా మ‌ర‌ణాలు మాత్రం కాస్త పెరిగాయి. అయితే గ‌డిచిన 24 గంట‌ల‌లో దేశ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ నుంచి కోలుకున్న వారి సంఖ్య మాత్రం భారీగా పెరిగింది. గురు వారం ఒక్క రోజే 3,47,443 మంది క‌రోనా వైర‌స్ ను జ‌యించారు. దీంతో ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా 21,05,611 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే దేశ వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 1,64,44,73,216 క‌రోనా వ్యాక్సిన్లను పంపిణీ చేసిన‌ట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ త‌న కరోనా బులిటెన్ లో తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news