ఇండియాలో 1,300 కేసులు.. 140 రోజుల తర్వాత అత్యధికం.. ఇక జాగ్రత్త పడాల్సిందేనా?

ప్రపంచంపై కరోనా మరోసారి తన పంజా విసురుతోంది. మళ్లీ కేసులు పెరుగుతూ విజృంభించడానికి కొవిడ్ రెడీ అయింది. ప్రజలు మరోసారి అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైనట్లు కనిపిస్తోంది. భారత్ లోనూ కరోనా మళ్లీ కోరలు చాస్తోంది. దేశంలో 140 రోజుల తర్వాత అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి.

బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు 1,300 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి వల్ల ముగ్గురు ప్రాణాలు విడిచారు. బుధవారం ఒక్కరోజే మహమ్మారి నుంచి 718 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.79 శాతంగా ఉంది. యాక్టివ్ కేసులు 0.02 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. క్రితం రోజుతో పోలిస్తే 166 కేసులు పెరిగాయని పేర్కొంది.

  • మొత్తం కేసులు: 4,46,99,418
  • మరణాలు: 5,30,816
  • యాక్టివ్ కేసులు: 7,605
  • రికవరీలు: 4,41,60,997

మరోవైపు.. దేశంలో బుధవారం 7,530 మందికి కొవిడ్ టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 2,20,65,28,710కు చేరింది. బుధవారం ఒక్కరోజే 89,078 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.