BREAKING: సుప్రీం కోర్టులో మరోసారి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఎదురుదెబ్బ !

-

BREAKING: సుప్రీం కోర్టులో మరోసారి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఇవాళ సుప్రీం కోర్టులో డిల్లీ సిఎం కేజ్రివాల్ బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగింది. లిక్కర్ సీబిఐ కేసులో బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు కేజ్రివాల్. అయితే.. కేజ్రివాల్ పిటిషన్ పై విచారణ జరిపారు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం. ఇప్పటికే ఈడి లిక్కర్ కేసులో కేజ్రివాల్ కు బెయిల్ ఇచ్చింది సుప్రీం కోర్టు.

Supreme Court granted interim bail to Delhi CM Kejriwal

సీబీఐ కేసులో బెయిల్ రాకపోవడం తో జైల్లోనే ఉన్నారు కేజ్రివాల్. ఇక సెప్టెంబర్ 5 కు తదుపరి విచారణ వాయిదా వేసింది ధర్మాసనం. కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ లలో ఒక పిటిషన్ పై నిన్న కౌంటర్ దాఖలు చేసింది సిబిఐ. మరో పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కోరారు సిబిఐ తరపు న్యాయవాది. వారం రోజులు సమయం కేటాయించింది సుప్రీంకోర్టు ధర్మాసనం. ఇక తదుపరి విచారణ సెప్టెంబర్ 5కు వాయిదా వేసింది సుప్రీం కోర్టు.

Read more RELATED
Recommended to you

Exit mobile version