ఢిల్లీ జహంగీర్ పురి కూల్చివేతలపై సుప్రీం కోర్ట్ కీలక తీర్పు… రెండు వారాల పాటు స్టే

-

ఢిల్లీ జహంగీర్ పురిలో కూల్చివేతలకు సంబంధించి సుప్రీం కోర్ట్ లో విచారణ జరిపింది. నిన్న జహంగీర్ పురిలో ఢిల్లీ నార్త్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, పోలీస్ బందోబస్త్ మధ్యలో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. అయితే నిన్న( బుధవారం) బుల్డోజర్లతో కూల్చివేస్తున్న తరుణంలో సుప్రీంలో జమియత్ ఉలమా-ఐ-హింద్‌ సంస్థ సుప్రీం కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో సుప్రీం కోర్ట్ ‘ స్టేటస్ కో’ అమలు చేయాలని అధికారులను ఆదేశించింది. అయితే తాజాగా ఈరోజ కూల్చివేతలపై విచారణ జరిగింది.

supreme-court
supreme-court

కూల్చివేతలపై మరో రెండు వారాలు స్టే అమలు చేయాలని సుప్రీం కోర్ట్ అధికారులను ఆదేశించింది. రెండు వారాలకు కేసును వాయిదా వేసింది. దీంతో  పాటు ఆదేశాలు అందిన తర్వాత కూడా కూల్చివేతలకు పాల్పడటాన్ని తీవ్రంగా పరిగణిస్తామని సుప్రీం కోర్ట్ వెల్లడించింది. ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేయాలని, అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలకు పాల్పడ్డారని జమియత్ ఉలమా-ఐ-హింద్‌ సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించారు.

ఇదిలా ఉంటే ఈ నెల 16న హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా జహంగీర్ పురిలో ఓ వర్గంవారు రాళ్లు రువ్వారు. ఇది ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటనలో 20 మందికి పైగా నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనల అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ కూల్చివేతల నిర్ణయం తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news