దేశంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది – జైరాం రమేష్

-

కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. 2019 లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటకలోని కోలార్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ సభ తర్వాత నిర్వహించిన సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు. తన స్పీచ్ లో ప్రధానమంత్రి మోడీపై వ్యాఖ్యలు చేశారు. నీరవ్ మోడీ, లలిత్ మోడీ, నరేంద్ర మోడీ.. అనే ఇంటి పేరు ఎందుకు ఉంది? దొంగలందరికీ మోడీ అనే ఇంటి పేరు ఎందుకు ఉంటుందో? అని వ్యాఖ్యానించారు.

అయితే రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలపై బిజెపి ఎమ్మెల్యే, గుజరాత్ మాజీమంత్రి పూర్నేష్ క్రిమినల్ కేసు, పరువు నష్టం దావా వేశారు. 2021 అక్టోబర్ లో రాహుల్ గాంధీ ఈ కేసు విచారణ నిమిత్తం సూరత్ కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇచ్చారు. పలు దఫాలుగా విచారణ తరువాత 2023 మార్చి 23న గురువారం కోర్టు తీర్పునిచ్చింది. అయితే  రాహుల్ గాంధీకి మరో షాక్‌ తగిలింది. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారు. ఈ మేరకు లోక్‌ సభ జనరల్‌ సెక్రటరీ నోటిఫికేషన్‌ ను రిలీజ్‌ చేశారు.

అయితే రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ జయరాం రమేష్ తప్పుపట్టారు. దీనిపై తాము చట్టపరంగా, రాజకీయపరంగా పోరాటం చేస్తామని.. తమను అణిచివేయలేరని పేర్కొన్నారు. అదాని, మహా మెగా స్కాంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాల్సింది పోయి రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేశారని మండిపడ్డారు. దేశంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందన్నారు జైరాం రమేష్.

Read more RELATED
Recommended to you

Latest news