BREAKING : ఎల్లుండి కర్ణాటక కొత్త సీఎం ప్రమాణస్వీకారం..డీకేనే ముఖ్యమంత్రి !

-

BREAKING : ఎల్లుండి కర్ణాటక కొత్త సీఎం ప్రమాణస్వీకారం చేయనున్నారు. అంటే.. మే 15వ తేదీన కర్ణాటక కొత్త సీఎం ప్రమాణస్వీకారం ఉంటుంది. అదే రోజు డీకే శివకుమార్‌ పుట్టిన రోజు. డీకే శివకుమార్‌కు కాంగ్రెస్‌ అధిష్టానం బర్త్‌డే గిఫ్ట్‌ ఏమిస్తుంది ? అనేదానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

ప్రస్తుతం సీఎం పదవి రేసులో డీకే శివకుమార్‌, సిద్ధరామయ్య ఉన్నారు. గతంలో సిద్ధరామయ్యకే సీఎం పదవి ఇచ్చారు. మరి ఈ సారి ఎవరికి ఈ పదవి దక్కుతుందో చూడాలి. ఇది ఇలా ఉండగా, కర్ణాటక ఎన్నికల ఫలితాలపై రాహుల్‌ గాంధీ స్పందించారు. కన్నడ ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన రాహుల్‌ గాంధీ.. అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలవబోతోందని వెల్లడించారు రాహుల్‌ గాంధీ. ప్రతి ఒక్కరు కష్టపడి కలిసిమెలిసి పనిచేశారు వారందరికీ నా కృతజ్ఞతలు.. కర్ణాటక ఎన్నికలలో పెట్టుబడిదారులకు పేదలకు మధ్య జరిగిన యుద్ధంలో పేదలు గెలిచారని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news