హ్యాట్రిక్ ఫిక్స్: తెలంగాణలో అధికారంలో బీఆర్ఎస్ పార్టీలో సగానికి సగం మంది టీడీపీ నుంచి వెళ్ళిన నాయకులే. ఆఖరికి సీఎం కేసీఆర్ సైతం..టిడిపి నుంచి బయటకొచ్చి పార్టీ పెట్టి సక్సెస్ అయ్యి, తెలంగాణ సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక కేసిఆర్ టిడిపి నేతలతో ఉన్న అనుబంధంతో అందులో ఉన్న నేతలని బిఆర్‌ఎస్ లోకి తీసుకొచ్చారు. దీంతో సగం పైనే నేతలు టిడిపి వాళ్ళే. ఇక అలా బిఆర్‌ఎస్ లోకి వచ్చిన మాజీ తమ్ముళ్ళు నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు.
అలా హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్న వారిలో కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఒకరు. ఈయన టీడీపీలో పనిచేశారు. 2014లో టిడిపి నుంచి కూకట్‌పల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత మారిన పరిణామాల నేపథ్యంలో బిఆర్‌ఎస్ లో చేరారు. 2018 ఎన్నికల్లో బిఆర్‌ఎస్ నుంచి పోటీ చేసి గెలిచారు. టిడిపి నుంచి పోటీ చేసిన నందమూరి సుహాసిని ఓడించి రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. ఇక ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మళ్ళీ గెలవాలని మాధవరం చూస్తున్నారు. దాదాపు ఈయనకే సీటు ఫిక్స్.
ఇక శేరిలింగంపల్లిలో అరికెపూడి గాంధీ సైతం హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్నారు. 2014లో ఈయన టిడిపి నుంచి దాదాపు 80 వేలు పైనే భారీ మెజారిటీతో గెలిచారు..నెక్స్ట్ బిఆర్‌ఎస్ లోకి వచ్చారు. 2018లో మళ్ళీ గెలిచారు. మళ్ళీ ఇప్పుడు గెలవాలని గాంధీ చూస్తున్నారు. ఇక జూబ్లీహిల్స్‌లో మాగంటి గోపినాథ్..ఈయన కూడా సేమ్ 2014లో టిడిపిలో గెలిచారు..తర్వాత బిఆర్‌ఎస్ లోకి జంప్ ..2018లో గెలిచారు. నెక్స్ట్ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు.
అటు కుత్బుల్లాపూర్ లో వివేకానంద గౌడ్ సైతం..అంతే 2014లో టిడిపి, 2018లో బిఆర్‌ఎస్ నుంచి గెలిచారు..నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. మరి ఈ మాజీ తమ్ముళ్లలో ఎవరు హ్యాట్రిక్ కొడతారో చూడాలి.