కోవిడ్‌ టీకా తీసుకున్న సర్టిఫికెట్‌ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారా ? అయితే జాగ్రత్త..!

-

దేశవ్యాప్తంగా కోవిడ్‌ టీకాల పంపిణీ కార్యక్రమం కొనసాగుతున్నప్పటికీ ఇంకా పలు చోట్ల 18-44 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారికి టీకాలను వేయడం లేదు. గతంలో మొదటి డోసు తీసుకున్న వారికే ఇప్పుడు రెండో డోసు వేస్తున్నారు. అయితే చాలా మంది టీకాలను తీసుకునేందుకు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. టీకాలను వేయించుకుంటున్నారు. కానీ టీకాలు వేయించుకున్న తరువాత తమకు ఇస్తున్న సర్టిఫికెట్‌ను వారు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. అయితే ఇలా ఆ సర్టిఫికెట్లను సోషల్‌ మీడియాలో పోస్టు చేయరాదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

do not share covid vaccine certificate in social media

కోవిడ్‌ టీకాలు తీసుకున్న వారు తమ సర్టిఫికెట్లను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయకూడదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సూచించింది. ఈ మేరకు సైబర్‌ దోస్త్‌ ట్విట్టర్‌ ఖాతాలో ఆ మంత్రిత్వ శాఖ ఒక ట్వీట్‌ చేసింది. కోవిడ్‌ టీకా తీసుకున్న అనంతరం డిజిటల్‌ సర్టిఫికెట్‌ను ఇస్తారు. దాన్ని కొందరు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. అలా చేయకూడదు. అందులో సున్నితమైన సమాచారం ఉంటుంది. దాన్ని సైబర్‌ నేరగాళ్లు సేకరించి ప్రజలను బ్లాక్‌ మెయిల్‌ చేయవచ్చు. లేదా ఆ సమాచారంతో వారికి నష్టం కలిగించే పనులు చేయవచ్చు. కనుక టీకాలను తీసుకున్న వారు తమకు ఇచ్చే సర్టిఫికెట్‌లను షేర్‌ చేయరాదు.. అని ట్వీట్‌లో తెలిపారు.

కోవిడ్‌ టీకా మొదటి తీసుకున్న వారికి ప్రొవిజనల్‌ సర్టిఫికెట్‌ను ఇస్తారు. అందులో తీసుకున్న వివరాలు, సమయం, తేదీ, పేరు, ఆధార్‌ కార్డు చివరి నాలుగు అంకెలు ఉంటాయి. రెండో డోసుకు ఎప్పుడు రావాలో అందులో తెలియజేస్తారు. ఇక రెండో డోసు తీసుకున్న తరువాత పూర్తి స్థాయి సర్టిఫికెట్‌ను జారీ చేస్తారు. దాన్ని డిజిటల్‌ రూపంలో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆ సర్టిఫికెట్‌ వల్ల ఇతర దేశాలకు వెళ్లినప్పుడు లాభం కలుగుతుంది. అందులో ప్రజలకు చెందిన వ్యక్తిగత సమాచారం ఉంటుంది. కనుక దాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేయరాదని సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news