జనరల్ చెకప్‌కు వచ్చిన వ్యక్తికి గుండెపోటు.. వైద్యుడి చాకచక్యంతో రోగి సేఫ్

-

జనరల్‌ చెకప్‌ కోసం ఓ వ్యక్తి డాక్టర్‌ వద్దకు వెళ్లాడు. డాక్టర్ అతని క్షేమసమాచారాలు అడుగుతుండగానే అతడికి ఉన్నట్టుండి గుండెపోటు వచ్చింది. వెంటనే అప్రమత్తమైన వైద్యుడు అతడికి సీపీఆర్ చేశాడు. డాక్టర్ చాకచక్యంతో ఆ రోగి క్షణాల్లోనే మళ్లీ సాధారణ స్థితికి చేరుకున్నాడు. ఈ దృశ్యాలు అక్కడి సీసీకెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ దృశ్యాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియో చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన అర్జున్‌ అద్నాయక్‌ కార్డియాలజీ నిపుణుడు. గుండె సంబంధిత వ్యాధి ఉన్న ఓ రోగి అర్జున్‌ వద్దకు నిత్యం జనరల్‌ చెకప్‌ కోసం వస్తుండేవారు. రెండ్రోజుల క్రితం రొటీన్‌ చెకప్‌ కోసం మరోసారి వైద్యుడి వద్దకు వచ్చారు. 12ఏళ్ల క్రితం అమర్చిన పేస్‌మేకర్‌ను ఈసారి భర్తీ చేయించుకోవాలనుకున్నారు. అయితే, క్యాబిన్‌లో వైద్యుడి ముందు సీట్లో కూర్చున్న ఆ రోగికి.. ఉన్నట్టుండి అప్పుడే గుండెపోటు వచ్చింది. ఎలాంటి చలనం లేకుండా కుర్చీలో కిందికి వాలిపోసాగాడు.

గమనించిన వైద్యుడు అర్జున్‌ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా.. వెంటనే లేచివచ్చి కుర్చీలో ఉన్న అతడికి అక్కడే సీపీఆర్‌ చేశాడు. కొద్ది సెకన్లలో ఆ రోగి మళ్లీ సాధారణ స్థితికి చేరుకున్నాడు. కాగా ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాడు.

Read more RELATED
Recommended to you

Latest news