BREAKING : ఉద్ధవ్ ఠాక్రే కు షిండే 3 పేజీల లేఖ విడుదల

మహారాష్ట్ర రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కు లేఖ రాశారు శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యే ఏక్‌నాథ్ షిండే. రెబల్ ఎమ్మెల్యేల నేత ఏక్‌నాథ్ షిండే 3 పేజీల లేఖ విడుదల చేశారు. తమ దగ్గర 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని.. కాసేపట్లో గవర్నర్‌కు లేఖ రాస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కు వార్నింగ్‌ ఇచ్చారు.

సీఎం ఎవరికీ అందుబాటులో ఉండట్లేదని… సీఎం ఇంటి తలుపులు ఇప్పుడు తెరుచుకున్నాయని ఏక్‌ నాథ్ షిండే లేఖలో వెల్లడించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఇన్ని రోజులు దారుణంగా వ్యవహరించారని ఫైర్‌ అయ్యారు. మమ్మల్ని ఇంత కాలం కలవలేదు…ఇప్పుడు మాత్రుశ్రీ లో ప్రజలను కలిస్తే సంతోషమని.. ఎన్నో సార్లు మీ పిఏ మాకు అపాయింట్ మెంట్ ఇస్తాను అన్నారు …కానీ అది ఎప్పుడు జరగలేదని ఆగ్రహించారు. ఇప్పటికి అయిన ప్రజలను కలవాలని లేఖలో ఉద్ధవ్ ఠాక్రే కు సూచించారు ఎక్ నాథ్ షిండే.