ఎన్నికల అభ్యర్థులకు షాక్.. ఈసీ కీలక నిర్ణయం

-

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. నగదు చలామణి తగ్గించే విషయంలో మరింత పారదర్శకతను తీసుకొచ్చేందుకు కొత్త ప్రతిపాదనను తెర మీదకు తీసుకొచ్చింది. పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రచార వ్యయంలో భాగంగా చేసే నగదు చెల్లింపులను ఇకపై రూ.2 వేలకే పరిమితం చేయాలని సూచించింది. ప్రస్తుతం ఈ మొత్తం రూ.10 వేలుగా ఉంది.

రూ.2 వేల కంటే ఎక్కువ చెల్లించాల్సి వస్తే.. బ్యాంకు ఖాతా, చెక్కులు లేదా డిజిటల్‌ పేమెంటు చేయాలని ఈసీ ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన ప్రతిపాదనల్లో సూచించింది. గుజరాత్‌ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన ఈసీ ఎన్నికల ఖర్చులను పర్యవేక్షిస్తూ, తనిఖీ చేసే ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, ఇతర బృందాలకు ఈ మేరకు ప్రామాణిక నిర్వహణ విధానం జారీ చేసింది.

ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం.. అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయటానికి కనీసం ఒక రోజు ముందైనా ఎన్నికల ఖర్చుల కోసం ప్రత్యేక బ్యాంక్ ఖాతాను తెరవాలి. నామినేషన్ తేదీ నుంచి ఎన్నికల ఫలితాల ప్రకటన తేదీ వరకు రోజువారీ ఖర్చులకు సంబంధించిన ఖాతా పుస్తకాన్ని నిర్వహించాలి. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన 30 రోజులలోపు అభ్యర్థి ఎన్నికల ఖర్చుల వివరాలకు సంబంధించిన ఖాతాను జిల్లా ఎన్నికల అధికారికి సమర్పించాలి.

Read more RELATED
Recommended to you

Latest news