దావూద్ ఇబ్రహీం మనీ లాండరింగ్ కేసు .. ఎన్సీపీ నేత, మంత్రి నవాబ్ మాలిక్ అరెస్ట్ చేసిన ఈడీ

-

మహారాష్ట్రలోని మహావికాస్ అఘాడీ సర్కార్ కు ఈడీ షాక్ ఇచ్చింది. ఎన్సీపీ కీలక నేత, మంత్రి నవాబ్ మాలిక్ ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసింది. ఈ ఉదయం మంత్రి నవాబ్ మాలిక్ ను ఈడీ ప్రశ్నిస్తోంది. అయితే నవాబ్ మాలిక్ నుంచి సరైన సమాచారం రావడ పోవడంతో ఈడీ అతన్ని అరెస్ట్ చేసింది. దావుద్ ఇబ్రహీంతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు నవాబ్ మాలిక్ పై ఉన్నాయి. దావుద్ ఇబ్రహీం మనిలాండరింగ్ కేసులో ఈయనకు సంబంధాలు ఉన్నాయని ఈడీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ అరెస్ట్ చోటు చేసుకుంది.

దీనిపై శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కేంద్రం ఈడీని దుర్వినియోగ పరుస్తోందని ఆరోపిస్తున్నారు. అరెస్ట్ చేశారు..కానీ నేను భయపడను, పోరాడి గెలుస్తానని నవాబ్ మాలిక్ అన్నారు. మరోవైపు నవాబ్ మాలిక్ అరెస్ట్ తో ఆ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ముంబైలోని ఈడీ ఆఫీస్ వద్దకు చేరారు. అరెస్ట్ కు ముందు నవాబ్ మాలిక్ ని వైద్య పరీక్షలకు పంపారు. ఆ తరువాత అరెస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news