అమిత్ షా పర్యటన వేళ.. బెంగాల్‌లో 3400 డిటోనేటర్లు కలకలం..!

-

కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన వేళ.. పశ్చిమ బెంగాల్‌లో పేలుడు పదార్థాలు కలకలం రేపాయి. బీర్‌భూమ్‌ జిల్లాలోని గుస్లారా బైపాస్‌ సమీపంలో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఓ స్కార్పియో కారు అనుమానాస్పదంగా కన్పించింది. బుధవారం నుంచి ఆ వాహనం అక్కడే ఉండటంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.

వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కారును తనిఖీ చేయగా.. అందులో 17 బాక్సులు ఉన్నాయి. వాటిని తెరిచి చూడగా ఒక్కో బాక్సులో 3400 డిటోనేటర్లు ఉన్నాయి. దీంతో పోలీసులు వెంటనే బాంబు స్క్వాడ్‌ను పిలిపించి పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేశారు. అనంతరం కారును స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అమిత్ షా పర్యటనకు ఒక రోజు ముందు ఈ ఘటన చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపింది.

గతేడాది జులైలోనూ బీర్‌భూమ్‌ జిల్లాలో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. ఓ పిక్‌అప్‌ వ్యాన్‌లో 81వేల డిటోనేటర్లను గుర్తించిన పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. భారీ పేలుళ్లకు వారు చేసిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఈ కేసును కేంద్ర హోంశాఖ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు అప్పగించింది. ఆ దర్యాప్తు కొనసాగుతుండగా.. తాజాగా ఇదే ప్రాంతంలో మరోసారి పేలుడు పదార్థాలు లభ్యమవడంతో ఎన్‌ఐఏ దీనిపై దృష్టి సారించింది.

Read more RELATED
Recommended to you

Latest news