స్విమ్మింగ్ పూల్ లో బాలికపై అత్యాచారం

మహిళలకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వాలు తీసుకు వస్తున్న కఠిన చట్టాలు కేవలం చేప్పుకోవడానికి మాత్రమే పరిమితం అవుతున్నాయి. మహిళలపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుల లో మాత్రం ఎక్కడ మార్పులు తీసుకు రావడం లేదు అని అర్థమవుతుంది. ఎందుకంటే రోజురోజుకు ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి తప్ప ఎక్కడా తగ్గుముఖం పట్టిన దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. దీంతో ప్రతిక్షణం ఆడపిల్ల భయపడుతూనే బతికే పరిస్థితి ఏర్పడింది. ఆడపిల్ల ఇంట్లో నుండి బయటకు వెళ్లింది అంటే చాలు మళ్ళీ క్షేమంగా తిరిగి వస్తుందా లేదా అని పేరెంట్స్ భయపడే పరిస్థితి ఉంది అని చెప్పాలి.

మహిళలు మహిళా సాధికారతకు వైపు అడుగులు వేస్తుంటే.. కామాంధులు మాత్రం వారిని వెనకడుగు వేసేలా చేస్తూనే ఉన్నారు.ఐతే ఓ కామాంధుడు గోవాలోని ఓ రిసార్టులో విదేశీ బాలికపై జరిగిన అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రష్యాకు చెందిన 12 ఏళ్ల బాలికపై రూమ్ అటెండెంట్ గా పనిచేస్తున్న రవి అత్యాచారం చేసినట్టు బాలిక తల్లి తెలిపింది. మొదట స్విమ్మింగ్ పూల్ లో, ఆ తర్వాత హోటల్ గదిలో ఈ నెల 6న అత్యాచారానికి పాల్పడినట్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.