మీ కోసం మేమున్నాం… ఇండియాకు అండగా ఫ్రాన్స్

భారత్ లో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. గత 24 గంటల్లో 3 లక్షలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. కేసుల కట్టడికి కేంద్ర సర్కార్ చర్యలు తీసుకున్నా సరే పెద్దగా ఫలితం మాత్రం ఉండటం లేదు. అయితే ఇప్పుడు మన దేశానికి ఇతర దేశాల నుంచి మద్దతు వస్తుంది. తాజాగా ఫ్రాన్స్ నుంచి మద్దతు వచ్చింది. కరోనా విషయంలో భారత్ కు తాము అండగా నిలుస్తామని ఫ్రాన్స్ ప్రకటన చేసింది.

కరోనా ఎవరిని వదిలే అవకాశం లేదు అని, కాబట్టి మేము భారత్ కు అండగా నిలుస్తామని చెప్పింది. ఏదైనా అవసరం ఉంటే తమ సహకారం ఇస్తామని తెలిపింది. మన దేశంలో మరణాలు భారీగా పెరుగుతున్నాయి. ఇది కట్టడి కాకపోతే మాత్రం వేరే ఇబ్బందులు కూడా దేశానికి వచ్చే అవకాశం ఉంది.