గుజరాత్ ఎన్నికలు సమీపీస్తున్న నేపథ్యంలో బీజేపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏడాదికి రెండు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇవ్వనుంది. ఈ నిర్ణయంతో గృహిణులకు రూ. 1,000కోట్ల మేర లబ్ధి చేకూరనుందని గుజరాత్ విద్యాశాఖ మంత్రి జీతూ వఘాని తెలిపారు.
ఈ పథకం కింద రాష్ట్రంలోని 38 లక్షల మంది గృహిణులను ఏడాదికి రెండు ఎల్పిజి సిలిండర్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. సిఎన్జి, పిఎన్జి గ్యాస్ ల పైన 10% వ్యాట్ ను తగ్గించనున్నట్లు గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది.
ఈ నిర్ణయంతో ఒక కేజీ సిఎన్జి పై రూ. 6 నుంచి 7 వరకు, అలాగే ఒక కేజీ పిఎన్జి పై రూ. 5 నుంచి 5.50 తగ్గనుందని మంత్రి జీతూ వఘా నీ తెలిపారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద లబ్ధి పొందుతున్న వారందరికీ ఈ పథకం వర్తిస్తుందని మంత్రి వఘా నీ తెలిపారు.