BREAKING: సామాన్యులకు బిగ్ షాక్..పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు

-

సామాన్యులకు బిగ్ షాక్ తగిలింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇవాళ మార్చి ఒకటో తేదీ. ఈ నేపథ్యంలో అన్ని వస్తువులపై ధరలు మార్పులు జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగిపోయాయి. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశాయి ఆయిల్ కంపెనీలు. 19 కేజీలు ఉన్న సిలిండర్పై ఏకంగా 25 రూపాయలు పెంచాయి ఆయిల్ కంపెనీలు.

gas cylinder

దీంతో ఢిల్లీలో ఈ గ్యాస్ సిలిండర్ ధర 1795 రూపాయలుగా నమోదు అయింది. ఇక ఏపీలో ఇదే మేరా పెరిగిపోయింది. దీంతో ఏపీలో కమర్షియల్ సిలిండర్ ధర 1959 రూపాయలుగా నమోదు అయింది. హైదరాబాద్ మహానగరంలో 17 రూపాయల పెరిగి 2002 రూపాయలుగా నమోదు అయింది. ఇటు గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరలో ఇలాంటి పెంపు లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version