శుభవార్త : భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు..!

-

బంగారం ధర భారీగా పతనమైంది. గత కొన్ని రోజులుగా పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్న బంగారం ధర.. నేడు అమాంతం దిగొచ్చింది. పడిపోయిన బంగారం ధర చూసి గోల్డ్ లవర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక బంగారం బాటలో నడిచిన వెండి ధర మరింత పడిపోయింది. హైదరాబాద్‌, విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ. 570 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ. 53,630కు చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల ధర రూ. 560 తగ్గడంతో రూ. 49,160కు చేరుకుంది.

అయితే వెండి ధర మాత్రం భారీగా పడిపోయింది. కేజీ వెండి ధర రూ. 1400 తగ్గిపోయింది. దీంతో ధర రూ. 65,800 కు చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం రూ.400 మేర తగ్గడంతో రూ.54,600 చేరుకుంది. అలాగే రూ.400 తగ్గుదలతో 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,000 కి దిగొచ్చింది. ఇక అంతర్జాతీయంగా చూసుకుంటే బంగారం ధర ఔన్స్‌ కు 1951 డాలర్లకు చేరగా. వెండి ధర ఔన్స్‌ కు 27.69 డాలర్లకు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news