మళ్లీ పెరిగిన బంగారం ధరలు ! తులం ఎంత పెరిగిందంటే..?

బంగారం ధరలు సామాన్య ప్రజలకు షాక్ ఇస్తున్నాయి. హైదరాబాద్ మార్కెట్ లో 22 క్యారెట్ల కు చెందిన తులం బంగారం ధర రూ. 350 పెరగడంతో.. ఈ రేటు రూ. 47,050 కు చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల కు చెందిన బంగారంపై కూడా రూ. 380 పెరగడంతో.. ఈ ధర రూ. 51,330 కోట్లు పెరిగింది. గత రెండు రోజులుగా బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ ఇండెక్స్ 20ఏళ్ల గరిష్ఠ స్థాయిల నుంచి కిందకు చూడటం ప్రారంభించడంతో.. బంగారం ధరకు ఊపు వచ్చింది. ఈ వారం మొత్తం మీద కూడా 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.46,250 నుంచి రూ.47,050 కు పెరిగింది. అంటే రూ.800 మేర ఈ ధరించి ఎగిసింది. ఇకపోతే హైదరాబాద్ మార్కెట్ లో సిల్వర్ రేట్ స్థిరంగా ఉంది. కేజీ వెండి ధర నేడు రూ.65,900 గా నమోదయింది.