రోజురోజుకు పొగమంచు తీవ్రత పెరిగిపోతుంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో పొగ మంచు ఎక్కువగా పడుతోంది. తెల్లవారుజామున, సాయంత్రం పూట.. రాత్రి పూట ఈ మంచు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది. చాలా చోట్ల పొగమంచు కారణంగా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా మంచు పడుతున్న సమయంలో పనులపై బయటకు వెళ్తున్న చాలా మంది వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు.
తాజాగా హర్యానా డిప్యూటీ సీంఎ దుష్యంత్ సింగ్ చౌతాలా వాహనం పొగమంచు కారణంగా ప్రమాదానికి గురైంది. సోమవారం రాత్రి ఆయన హిస్సార్ నుంచి సిర్సాకు ప్రయాణిస్తుండగా అగ్రోహా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ ప్రమాదం నుంచి చౌతాలా సురక్షితంగా బయటపడగా.. ఓ పోలీస్ అధికారి గాయపడ్డారు. దుష్యంత్ వాహనశ్రేణి అగ్రోహాలోని బీఎస్ఎఫ్ క్యాంప్ దాటుతుండగా ఓ వాహనం బ్రేక్ వేయడంతో ఈ ఘటన చోటు చేసుకొంది.