దళిత జంట పెళ్లికి 60 మంది పోలీసుల భారీ బందోబస్తు.. ఎందుకంటే..

-

ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ దళిత పెళ్లి వేడుకకు పోలీసులు భారీ బందుబోస్తు ఏర్పాటు చేశారు. ఏకంగా 60 మంది పోలీసులు పెళ్లికి సెక్యురిటీ కల్పించారు.. ఆ ఇంట్లో ఎవరైనా పోలీస్‌ ఉన్నతాధికారులు ఉంటే అనుకోవచ్చు.. కానీ వాళ్లది సాధారణ కుటుంబం.. మరి అంత మంది ఎందుకు .. అసలు ఏం జరిగిందో తెలిస్తే షాక్‌ అవుతారు..
ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లా గున్నౌర్‌ ప్రాంతంలోని లోహమై గ్రామంలో రవినా , రామ్‌కిషన్ అనే ఇద్దరు ప్రేమికులు పెళ్లితో ఒకటయ్యారు. అయితే వాళ్ల పెళ్లికి అబ్బాయి తరఫు పెద్దలు అంగీకరించలేదు. ఎందుకంటే అమ్మాయి దళితురాలు కావడంతో రామ్‌కిషన్ తల్లిదండ్రులు పెళ్లికి ససేమిరా అన్నారు. కాని ప్రేమించుకున్న ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని పోలీసుల్ని ఆశ్రయించారు. అంతే దళితురాలైన అమ్మాయి కుటుంబ సభ్యుల కోరిక మేరకు 60మంది పోలీసులు పెళ్లి వేడుక జరుగుతున్న ఇంటి దగ్గర కాపలా కాశారు.
పెళ్లి వేడుక జరుగుతున్న సమయంలో 44మంది కానిస్టేబుళ్లు, 14మంది ఎస్‌ఐలు, ఒక సీఐ, మరొక ఇన్స్‌పెక్టర్, మరో సర్కిల్ ఆఫీసర్‌ అందరూ అమ్మాయి కుటుంబ సభ్యులపై అబ్బాయి తరపు బంధువులు దాడి చేయుకండా జాగ్రత్తగా పెళ్లి జరిపించారు. అయితే పెళ్లికి ఎస్కార్ట్‌గా వ్యవహరించడమే కాదు తర్వాత దంపతుల్ని గుర్రంపై ఊరేగిస్తూ డీజే మ్యూజిక్‌ మధ్య డ్యాన్సులు కూడా చేశారు. దళిత జంటను ఈవిధంగా ఊరేగించడానికి అగ్రవర్ణాలు అంగీకరించకపోవడంతో పోలీసుల పర్మిషన్‌తో బారాత్ నిర్వహించారు.
పెళ్లి కుమార్తె మేనమామ అభ్యర్ధనతో పోలీసులు ఈ పెళ్లికి భద్రత కల్పించడంతో పాటు ఊరేగింపును కూడ ఘనంగా నిర్వహించారు. అంతేకాకుండా.. పోలీసు సిబ్బంది అంతా కలిసి డబ్బులు సేకరించి 11వేల రూపాయలను కానుకగా వధువరులకు అందజేశారు. ఓ దళితురాలి పెళ్లికి పోలీసులు ఇంతలా సహకరించడంతో ఈ వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో బలగాల మధ్య జరగడం చర్చనీయాంశమైంది. ఆ పెళ్లి వేడుక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news