బ్యాడ్ న్యూస్.. మీడియా స్వేచ్ఛలో మరింత దిగువకు భారత్‌

-

బ్యాడ్ న్యూస్.. మీడియా స్వేచ్ఛలో భారత్‌ మరింత దిగువకు పడిపోయింది. ప్రపంచ మీడియా స్వేచ్ఛా సూచి-2023లో 161వ స్థానానికి పరిమితమైంది. గత ఏడాది 150వ స్థానంలో ఉన్న భారత్‌ ఈసారి 11 ర్యాంకులు పడిపోయి 161కి చేరింది. రిపోర్టర్స్‌ వితవుట్‌ బోర్డర్స్‌ (ఆర్‌ఎస్‌ఎఫ్‌) అనే గ్లోబల్‌ మీడియా వాచ్‌డాగ్‌ ప్రతి ఏడాది ప్రపంచ మీడియా స్వేచ్ఛా దినోత్సవం సందర్భంగా ఈ స్వేచ్ఛా సూచిని ప్రచురించింది. మొత్తం 180 దేశాలకు ర్యాంకులను కేటాయించింది.

ఈ ర్యాంకుల్లో సమస్యాత్మకం నుంచి అత్యంత దారుణ పరిస్థితికి తుర్కియే, భారత్‌, తజికిస్థాన్‌ చేరుకున్నాయని ఆర్‌ఎస్‌ఎఫ్‌ పేర్కొంది. రాజకీయ నేతలకు సన్నిహితంగా ఉండే వ్యక్తులు మీడియా సంస్థలను కొనుగోలు చేసి వార్తల స్వేచ్ఛా ప్రసారాలను అడ్డుకుంటున్నారని ఆరోపించింది. మీడియా స్వేచ్ఛా సూచీలో భారత్‌ ర్యాంకు మరింత పడిపోవడంపై ఇండియన్‌ ఉమెన్స్‌ ప్రెస్‌ కార్ప్స్‌, ప్రెస్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా, ప్రెస్‌ అసోసియేషన్‌లు ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రజాస్వామ్య వ్యవస్థల్లో మీడియా పాత్రను తక్కువ చేయడం సరికాదని ఒక సంయుక్త ప్రకటనలో అవి వ్యాఖ్యానించాయి.

Read more RELATED
Recommended to you

Latest news