మోదీ హిమాచల్ ప్రదేశ్ పర్యటనలో ఆసక్తికర ఘటన..కాన్వాయ్ ఆపి..!

ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం నాటి హిమాచల్ ప్రదేశ్ పర్యటనలో భాగంగా ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో రోడ్డుకు ఇరువైపులా నిలబడ్డ జనానికి అభివాదం చేస్తూ స్పీడుగా సాగుతున్న మోదీ.. ఓ చోట ఉన్నట్టుండి తన కాన్వాయ్ ని ఆపారు. ఆ తర్వాత కారులో నుంచి దిగిన మోదీ.. ఆ జన సమూహం లో భారీకేడ్లకు ఆవల నిలిచిన ఓ బాలిక వద్దకు వెళ్లారు.

 

ఆ బాలిక చేతిలోని పెయింటింగ్ ను తీసుకున్నారు. భారీకేడ్లకు ఆవలే నిలుచుండి మరీ మోడీ కాళ్లకు ఆ బాలిక నమస్కరిస్తే.. మోదీ ఆ బాలికను ఆశీర్వదించారు. ఇంతకీ ఆ బాలిక గీసిన పెయింటింగ్ ఎవరిదో తెలుసా.? మోదీ మాతృమూర్తిది. కాన్వాయ్ లో స్పీడుగా వెళుతున్న మోడీ.. తన తల్లి పెయింటింగ్ చూడగానే తన కాన్వాయ్ ని నిలిపి వేయడం గమనార్హం.