పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వేల కోట్ల రూపాయలు ఎగవేసి విదేశాలకు పరారైన ఆర్థిక నేరగాడు, డైమండ్ వ్యాపారి నీరవ్ మోడీ భార్య అమీ మోడీపై ఇంటర్ పోల్ సంస్థ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. మనీలాండరింగ్ ఆరోపణలతో నమోదైన కేసులో భాగంగా దర్యాప్తు సంస్థ ఈడీ అభ్యర్థన మేరకు ఇంటర్ పోల్ ఈ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. గత ఏడాది ఫిబ్రవరిలో ఈడీ అమీ మోదీని అనుబంధ చార్జిషీట్‌లో పేర్కొంది.
గత ఏడాది ఫిబ్రవరిలో న్యూయార్క్ నగరంలో రెండు అపార్టుమెంటులను 30 మిలియన్ డాలర్లు కొనుగోలు చేసినందుకు లబ్ధిదారిగా ఆరోపించినందుకు అమీ మోదీని ఈడీ చార్జిషీట్‌లో పేర్కొంది. దీంతో ఇక ఆమె ఏ దేశంలో ఉన్నా అరెస్ట్ చేయవచ్చని అధికారులు తెలిపారు. అయితే ప్రస్తుతం నీరవ్ మోడీ యూకే జైల్లో ఉన్నాడు. అక్కడ నుండి అతనిని భారతదేశానికి అప్పగించే ప్రయత్నాలు జరుతున్నాయి.