సంజీవని క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ కేంద్ర మంత్రి అయిన గజేంద్ర సింగ్ షెఖావత్ పాత్రపై దర్యాప్తు చేయాలని జైపూర్ కోర్టు గురువారం ఆదేశించింది. అయితే జరిగిన కుంభకోణం లో రూ.884 కోట్ల గురించి, అందులో ఆయన పాత్ర పై రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్ఓజీ) ని నిగ్గు తేల్చాలని గురువారం ఆదేశించింది. కొంత మొత్తాన్ని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్, ఆయన భార్య ఇతరుల యాజమాన్యం లోని కంపెనీలకు బదిలీ అయిందని, దీనిపై దర్యాప్తు జరగడం లేదని పిటిషనర్లు ఆరోపించారు. కుంభకోణం లో గజేంద్ర సింగ్ పాత్ర పై దర్యాప్తు జరపాలని కోరడం కూడా జరిగింది.
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖలో తన ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు గజేంద్ర సింగ్ షెఖావత్, ఇతర బీజేపీ నేతలు ప్రయత్నించారని, ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించారని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా సంజీవని క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ కుంభకోణంపై ఎస్ఓజీ గత ఏడాది నుంచి దర్యాప్తు చేస్తున్న సంగతి అందరికి తెలిసినదే.