జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్… లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం

-

జమ్మూ కాశ్మీర్ ఎన్ కౌంటర్ లో భద్రతా బలగాలకు భారీ విజయం లభించింది.  నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కర్ ఏ తోయిబాకు చెందిన కీలక కమాండర్ ను హతమార్చారు. బారాముల్లా జిల్లాలో గురువారం భద్రత బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. పారిస్వానీ ప్రాంతంలో ఉగ్రవాదుల ఉన్నారనే పక్కా సమచారంతో గాలింపులు చేపట్టగా ఉగ్రవాదుల నుంచి కాల్పులు ప్రారంభం అయ్యాయి. ఈ ఎన్ కౌంటర్ లో లష్కరే తోయిబా టాప్ కమాండర్ యూసుఫ్ కంత్రూతో పాటు మరో ఉగ్రవాదిని కూడా హతమార్చారు. ఈ ఘటనలో మొత్తం ఇద్దరు ఉగ్రవాదులు మరణించగా… ముగ్గురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. 

ఈ ఎన్ కౌంటర్ లో ఎల్ఇటీ టాప్ కమాండర్ యూసఫ్ కాంత్రూను హతమార్చడం భద్రతా బలగాలకు పెద్ విజయం అని జమ్ముకాశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ అన్నారు. కాంత్రూ గతంలో పౌరులు, భద్రతా సిబ్బంది హత్యలలో పాల్గొన్నాడని.. ఇటీవల బుద్గామ్ లో జరిగిన సైనికుడు, పోలీస్ అధికారి, అతని సోదరుడి హత్యలో కాంత్రూ  ప్రమేయం ఉందని ఆయన వెల్లడించారు. ఘటన స్థలం నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news