గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జిఘ్నేష్ మేవానీని అరెస్ట్ చేసిన అస్సాం పోలీసులు

-

దేశంలో ప్రముఖ దళిత నేత, గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జిఘ్నేష్ మేవానీని అరెస్ట్ చేశారు అస్సాం పోలీసులు. గుజరాత్ లోని వడ్గామ్ ఎమ్మెల్యేగా ఉన్న జిఘ్నేష్ మేవానిని నిన్న(బుధవారం) రాత్రి 11:30 గంటల ప్రాంతంలో పాలన్‌పూర్ సర్క్యూట్ హౌస్ లో అస్సాం పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పోలీసుల నుంచి ఇంకా ఎఫ్ఐఆర్ అందలేదని… అయితే అతనిపై అస్సాంలో కేసులు నమోదైన విషయాన్ని మాత్రమే వెల్లడించారని జిఘ్నేష్ మేవానీ అనుచరులు ఆరోపిస్తున్నారు. ఇండిపెండెంట్ గా గెలిచిన జిఘ్నేష్ మేవానీ గుజరాత్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నాడు. 

ఇటీవల జిఘ్నేష్ మేవానీ చేసిన వివాదాస్పద ట్వీట్ పై అస్సాంలో కేసులు నమోదయ్యాయి. గుజరాత్ లో మత ఘర్షణలను ఉద్దేశించి ఆయన ట్విట్టర్ వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. “గాడ్సేను దేవుడిగా భావించే ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్‌లో మత ఘర్షణలకు వ్యతిరేకంగా శాంతి మరియు సామరస్యం కోసం విజ్ఞప్తి చేయాలి” అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ పై అస్సాంలో పలు ప్రాంతాాల్లో కేసులు నమోదు అయ్యాయి. మేవానీపై 120బి (నేరపూరిత కుట్ర), సెక్షన్ 153 (ఎ) (రెండు వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం), 295 (ఎ), 504 (శాంతి భంగం కలిగించే ఉద్దేశ్యంతో ఉద్దేశపూర్వకంగా అవమానించడం), మరియు ఐటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news