సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటనపై అమిత్ షాతో భేటీ అయిన కిషన్ రెడ్డి

కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపధ్ పథకానికి వ్యతిరేకంగా శుక్రవారం ఉదయం భారీ ఎత్తున రైల్వే స్టేషన్ కు చేరుకున్న ఆందోళనకారులు చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనలో మూడు ఎక్స్ప్రెస్ రైళ్లు, ఎంఎంటీఎస్ రైళ్లు దహనం అయ్యాయి. రైల్వే స్టేషన్ కు చెందిన పలు ఆస్తులు ధ్వంసమయ్యాయి. స్టేషన్ చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అదుపు చేసేందుకు ప్రయత్నించారు.

ఆందోళనకారులపై రైల్వే పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు యువకులు మృతి చెందారు. మరి కొందరు యువకులు గాయపడ్డారు. ఈ ఘటనపై హోం మంత్రి అమిత్ షా ను కలిశారు మంత్రి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అగ్నిపధ్ స్కీం కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల తీరును అమిత్ షా కు వివరించారు. ఇప్పటికే కేంద్ర హోం శాఖకు సికింద్రాబాద్ అగ్నిపధ్ అల్లర్లపై ప్రాథమిక నివేదిక అందినట్లు సమాచారం.