వరల్డ్ కప్ లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమ్ ఇండియా నిన్న బెంగళూరులో దీపావళి వేడుకలు చేసుకుంది. కెప్టెన్ రోహిత్, కోహ్లీ దంపతులతో పాటు ఇతర ఆటగాళ్లు సాంప్రదాయ దుస్తులు ధరించి సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. అందరూ సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించిన ఎక్స్ క్లూజివ్ వీడియోను బీసీసీఐ తాజాగా ట్వీట్ చేసింది. కాగా WCలో భాగంగా టీమిండియా ఇవాళ నెదర్లాండ్స్ తో మ్యాచ్ ఆడనుంది.
ఈ మ్యాచ్ కర్ణాటక రాష్ట్రం బెంగళూరు లో ఉన్న చిన్న స్వామి స్టేడియంలో జరుగుతుంది. ఎప్పటిలాగే ఈ మ్యాచ్ ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం అవుతుంది.పెద్దగా ఈ మ్యాచ్ కు ప్రాధాన్యత లేదు. ఎందుకంటే ఇప్పటికే టీమ్ ఇండియా సెమీఫైనల్ కు చేరింది. దీంతో సీనియర్ ఆటగాళ్లకు ఈ మ్యాచ్ లో విశ్రాంతి ఇచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా, సిరాజ్, లాంటి కీలక ప్లేయర్లకు ఇవాళ రెస్ట్ ఇచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక రోహిత్ శర్మ స్థానంలో కేఎల్ రాహుల్ కెప్టెన్సీ చేయనున్నట్లు తెలుస్తోంది.