ముంబయి హత్య కేసులో ట్విస్ట్‌.. ‘ఆమె ఆత్మహత్య చేసుకున్న తర్వాత ముక్కలు చేశా’

-

దిల్లీలోని శ్రద్ధా వాకర్‌హత్య తరహాలోనే.. మహారాష్ట్రలో మనోజ్ సాహ్ని అనే వ్యక్తి తన సహజీవన భాగస్వామిని చంపి, ఆమె శరీరాన్ని ముక్కలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో తాజాగా అనూహ్య విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాను హత్య చేయలేదని, ఆమే ఆత్మహత్యకు పాల్పడిందని నిందితుడు పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. కేసు అవుతుందన్న భయంతో శ్రద్ధా వాకర్ హత్య స్ఫూర్తితో ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేశానని విచారణలో నిందితుడి చెప్పినట్లు సమాచారం.

ఈ విచారణలో అతడు చెప్పిన విషయాలు విని పోలీసులు కంగుతిన్నారు. తాను హెచ్‌ఐవీ బాధితుడినని మనోజ్‌ పోలీసులు చెప్పాడు. చాలా ఏళ్ల క్రితమే ఈ వ్యాధి బారిన పడినట్లు తెలిపాడు. మృతురాలు సరస్వతితో తనకు శారీరక సంబంధం లేదని, ఆమెను తాను కుమార్తెలా చూసుకున్నానని నిందితుడు చెప్పినట్లు తెలుస్తోంది.

‘‘సరస్వతి పదో తరగతి పరీక్షలు రాయాలనుకుంది. ఇందుకోసం నేను ఆమెకు గణిత పాఠాలు చెప్పేవాడిని. అయితే, ఆమె చాలా సంకుచితంగా ఉండేది. నేను ఎప్పుడు ఆలస్యంగా ఇంటికి వచ్చినా అనుమానించేది. అయితే, జూన్‌ 3న నేను బయటి నుంచి ఇంటికి వచ్చే సరికి ఆమె ఆత్మహత్య చేసుకుని కన్పించింది. కేసులో ఇరుక్కుంటానన్న భయంతో ఆమె మృతదేహాన్ని మాయం చేయాలనుకున్నా. ’’ అని నిందితుడు పోలీసులకు తెలిపినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news