మణిపుర్‌లో హింసాత్మక ఘర్షణలపై మేరీకోమ్ ఆవేదన

-

మణిపుర్‌ రాష్ట్రం హింసాత్మకంగా మారింది. మెజార్టీ మైతై కమ్యూనిటీని షెడ్యూల్‌ తెగలో చేర్చే చర్యలను వ్యతిరేకిస్తూ గిరిజన సంఘాలు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో ఆ రాష్ట్రం రావణకాష్టంలా తగలబడుతోంది. నిరసనకారులు ప్రార్థనా స్థలాలు, వాహనాలను తగలబెట్టడంతో ఈ ఘర్షణలను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఆర్మీ, అసోం రైఫిల్ బలగాలను రంగంలోకి దింపింది. ఈ క్రమంలో ఆర్మీ మార్చ్‌ ఫ్లాగ్ నిర్వహించింది.

రాజధాని ఇంఫాల్, చురాచాంద్‌పుర్‌, కాంగ్‌పోక్పిలో ఘర్షణలు జరగడంతో రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాలో కర్ఫ్యూ విధించారు. ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. ఆర్మీ శిబిరాలు, ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో నాలుగువేల మంది ప్రజలకు ఆశ్రయం కల్పించారు.

ప్రస్తుతం పరిస్థితులపై ప్రముఖ బాక్సర్ మేరీకోమ్‌ ట్విటర్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. ‘మా రాష్ట్రం మండిపోతోంది. సహాయం చేయండి’ అని ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్‌ షాను అభ్యర్థించారు. ఈ హింసపై అమిత్‌ షా.. ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌తో మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను కేంద్రం సునిశితంగా గమనిస్తోందని వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news