కాసేప‌ట్లో హైద‌రాబాద్‌కు మోదీ!

Join Our COmmunity

కాసేప‌ట్లో హైద‌రాబాద్‌కు మోదీ!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మో‌దీ ప‌ర్య‌ట‌న మూడు న‌గ‌రాల ప‌ర్య‌ట‌న ప్రారంభ‌మైంది. తొలుత ఆయ‌న అహ్మ‌దాబాద్‌లోని జైడ‌స్ బయోటెక్ పార్కును సంద‌ర్శిస్తున్నారు. అక్క‌డి నుంచి నేరుగా మ‌ధ్యాహ్నం ఒంటిగంట వ‌ర‌కు హైద‌రాబాద్ కు చేరుకోనున్నారు. హైద‌రాబాద్‌లో భార‌త్ బ‌యోటెక్ సంస్థ‌ త‌యారు చేస్తున్న కొవిడ్ వ్యాక్సిన్ ప‌రిశీలిస్తారు. అనంత‌రం పూణేకు వెళ్లి సీర‌మ్ ఇన్సిస్టిట్యూట్ ను సంద‌ర్శిస్తారు.

కొవిడ్ వ్యాక్సిన్ త‌యారీ, దానిని సంసిద్ధ‌త‌పై పైనే ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌ట‌న కొన‌సాగుతున్న‌ది. వ్యాక్సిన్ ఎంత స‌మ‌యంలో అందుబాటులోకి వ‌స్తుంది. అందుబాటులోకి వ‌స్తే దానిని ఎలా ప్ర‌జ‌ల‌కు అందించాలి.. బ్లాక్ మార్కెట్‌కు త‌ర‌ల‌కుండా ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాల‌నే అంశాల‌పైనే మోదీ ప‌ర్య‌ట‌న కొన‌సాగుతున్న‌ది. అయితే గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో మోదీ హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న ఆస‌క్తి రేపుతున్న‌ది. ఇప్ప‌టికే ఆయా పార్టీలు హీట్ పుట్టించే వ్యాఖ్య‌ల‌తో ఎన్నిక‌ల ప్ర‌చారంలో దూసుకెళ్తున్నారు. ఇవ్వాల టీఆర్ ఎస్ బాస్‌, ముఖ్య‌మంత్రి సీఎం కేసీఆర్ ఎల్చీ స్టేడియంలో భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించనున్నారు. కేసీఆర్ స‌భ‌, మోదీ ప‌ర్య‌ట‌న‌తో ఒక్క‌సారిగా గ్రేట‌ర్ పాలిటిక్స్ హీటెక్కాయి.

TOP STORIES

డేల్యూజనల్ డిజార్డర్ అంటే ఏమిటి.. లక్షణాలు.. కారణాలు.. నయం చేసే వీలు..

చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది.. కన్న కూతుళ్ళనే పొట్టన పెట్టుకున్న తల్లితండ్రుల మానసిక వైకల్యం గురించి చర్చ జరుగుతుంది....
manalokam telugu latest news