IPL 2023 కోసం అంబానీ బిగ్‌ స్కెచ్‌

-

IPL 2023 కోసం అంబానీ బిగ్‌ స్కెచ్‌ వేశారు. ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా ఉన్న ముంబై ఇండియన్స్, వచ్చే సీజన్ నుంచి కొత్త హెడ్ కోచ్ తో బరిలోకి దిగబోతున్నది. 2017 నుంచి ఆ జట్టుకు హెడ్ కోచ్ గా పని చేసిన శ్రీలంక మాజీ క్రికెటర్ మహేళ జయవర్దేనే ఇటీవల ఆ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో తాజాగా, ముంబైకి హెడ్ కోచ్ గా మార్క్ బౌచర్ ను నియమించింది.

బౌచర్ ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. వచ్చే నెలలో ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సి ఉన్న టి20 ప్రపంచ కప్ తర్వాత బౌచర్ సఫారీ టీం కు వీడ్కోలు చెప్తాడు. బౌచర్ నియామకం పై గత రెండు రోజులుగా క్రికెట్ వర్గాలలో జోరుగా చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఈ రేసులో సైమన్ కటిచు తో పాటు ఇతర మాజీ క్రికెటర్ల పేరు రేసులోకి వచ్చాయి. కానీ కటీచును దక్షిణాఫ్రికా క్రికెట్ లీగ్ లో ముంబైకి ఉన్న మరో ఫ్రాంచైజీ ఎంఐ కేప్ టౌన్ కు నియమించింది ఆ జట్టు యాజమాన్యం. ఇక ముంబై ఇండియన్స్ జట్టుకు బౌచర్ పేరును ఖరారు చేస్తూ ట్విట్టర్ వేదికగా ప్రకటన చేసింది. బౌచర్ కు ‘వన్ ఫ్యామిలీ’ కి స్వాగతం చెబుతూ ట్వీట్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news