‘‘నాకు చాలా బాధగా ఉంది. తప్పు జరిగినప్పుడు క్షమాపణ కోరడానికి నేను వెనుకాడబోను. బరేలా నుంచి మండ్లా వరకు వేసిన రోడ్డు విషయంలో నాకు సంతృప్తి లేదు. అక్కడ సమస్య ఉందని తెలుసు. నేను అధికారులతో మాట్లాడాను. పెండింగ్‌లో ఉన్న పని గురించి కాంట్రాక్టరుతో మాట్లాడి.. ఓ పరస్పర అంగీకారానికి రావాలని కోరాను. కొత్త టెండర్లు పిలిచి మళ్లీ రోడ్డు వేయాలని ఆదేశించాను. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న ఇబ్బందులకు క్షమాపణలు కోరుతున్నా’’ అని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. మధ్యప్రదేశ్‌లో ఓ రహదారి నిర్మాణంలో నాణ్యత లోపించిందని తెలిసి ఆ ప్రాంత ప్రజలకు క్షమాపణలు చెప్పారు.
మధ్యప్రదేశ్‌లో మండ్లా నుంచి జబల్‌పూర్ వరకు రహదారిని నిర్మిస్తున్నారు. ఇందులో బరెలా నుంచి మండ్లా వరకు వేసిన 63 కి.మీ రోడ్డు నాణ్యత విషయంలో తనకు సంతృప్తి లేదని తెలిపారు. అందుకు తనని క్షమించాలని జబల్‌పూర్‌లో జరిగిన ఓ సభలో ప్రజల్ని కోరారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ కూడా ఉన్నారు.