I-N-D-I-A పేరు బిహార్ సీఎం నీతీశ్‌కు నచ్చలేదట

-

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏను ఎలాగైనా ఓడించేందుకు విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి మరీ కార్యాచరణ సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఉమ్మడిపోరుకు కట్టిన జట్టుకు ఇండియాగా నామకరణం కూడా చేశారు. ఈ పేరును కూటమిలోని అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో సమ్మతించాయని విపక్ష నేతలు తెలిపారు. కానీ.. బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్‌ మాత్రం ఈ పేరును వ్యతిరేకించినట్లు టాక్. ఇతర పార్టీల నేతలు సర్దిచెప్పడంతో చివరకు ఆయన అంగీకరించినట్లు పేర్కొన్నాయి.

ప్రతిపక్షాల కూటమి పేరు గురించి కాంగ్రెస్‌ ముందుగా ఎలాంటి చర్చలు జరపలేదట. విపక్ష నేతల భేటీ సమయంలో ఉన్నట్టుండి ‘ఇండియా (INDIA)’ అనే పేరును ఆ పార్టీ నేతలు ప్రతిపాదించారని సదరు వర్గాలు తెలిపాయి. ఆ పేరు వినగానే నీతీశ్ కుమార్‌ షాక్‌ అయ్యారని .. ‘‘ప్రతిపక్షాల కూటమికి INDIA అనే పేరు ఎలా పెడతారు? పైగా ఇందులో బీజేపీకి చెందిన NDA కూటమి అక్షరాలున్నాయి?’’ అని ఆయన ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version