డిసెంబర్‌లో మానవ రహిత అంతరిక్షయాత్ర చేపట్టలేం: ఇస్రో

-

కొవిడ్-19 సెకండ్ వేవ్ ప్రభావం అంతరిక్ష కార్యక్రమాలపై పడింది. డిసెంబర్‌లో చేపట్టాల్సిన మానవ రహిత అంతరిక్ష యాత్రను ఇస్రో వాయిదా వేసింది. మహమ్మారి కారణంగా ప్రతిష్ఠాత్మకమైన యాత్రకు అవసరమైన విడిభాగాల సరఫరాలో అంతరాయం ఏర్పడిందని, అందుకే మానవ రహిత అంతరిక్ష యాత్రను వాయిదా వేస్తున్నట్లు సోమవారం ఇస్రో ప్రకటించింది.

మానవ సహిత యాత్ర ‘గగన్ యాన్‌’లో భాగంగా మొదట రెండు మానవ రహిత అంతరిక్ష యాత్రలను చేపట్టాలని ఇస్రో నిర్ణయించింది.

ఇటీవల కొవిడ్-19 సెకండ్ వేవ్ విజృంభించడంతో చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించడంతో స్పేస్ హార్డ్‌వేర్ ఇండస్ట్రీ తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ కారణంగా బెంగళూరులోని అంతరిక్షశాఖ విడిభాగాల సరఫరాలో జాప్యం చోటుచేసుకున్నది.

గగన్‌యాన్ డిజైన్, అనాలసిస్, డాక్యుమెంటేషన్‌ను ఇస్రో ఇప్పటికే పూర్తిచేసింది. కానీ, గగన్‌యాన్‌ రూపొందించడానికి అవసరమైన హార్డ్‌వేర్ దేశవ్యాప్తంగా ఉన్న వందల పరిశ్రమల నుంచి సరఫరా కావాల్సి ఉంటుంది.

డిసెంబర్‌లో మానవ రహిత యాత్ర చేపట్టడం కచ్చితంగా సాధ్యం కాదు అని ఇస్రో చైర్మన్ కే శివన్ తెలిపారు. వచ్చే ఏడాదికి వాయిదా వేస్తున్నట్టు స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news