ఢిల్లీ వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టులో పిటిషన్

-

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరిన తరుణంలో కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. పంజాబ్, హర్యానా లో పంట వ్యర్ధాల దహనాన్ని అరికట్టాలని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై ఈ నెల 10వ తేదీన సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టనుంది. అయితే రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది.

పొరుగు రాష్ట్రాలు పంజాబ్, హర్యానా తో పాటు యూపీ రైతులు పంట వ్యర్ధాలను కాలుస్తూ ఉండడంతో ఆ పొగంతా ఢిల్లీని దట్టంగా కమ్మేస్తోంది. మరోవైపు ఈ వాయు కాలుష్యంపై జాతీయ మానవ హక్కుల సంఘం సీరియస్ అయింది. ఈనెల 10వ తేదీన ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు తమ ముందు హాజరుకావాలని నోటీసులు జారీీ చేసింది. ఆర్టికల్ 47 ప్రకారం ప్రజారోగ్యం, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news