దీపావళి ముందు రైతులందరికీ కేంద్రం తీపి కబురు చెప్పబోతోంది. రైతులకు ప్రధాని నరేంద్ర మోదీ ఇస్తున్న స్కీముల్లో ప్రధాని మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఒక టి. రైతులకు రూ. 6000 ఈ స్కీమ్ ద్వారా అందిస్తోంది. అయితే, రైతుల ఖాతాల్లోకి మరోసారి నగదు బదిలీ చేసేందుకు రంగం సిద్ధమైంది.
పీఎం కిసాన్ పథకం కింద 12వ విడత నిధులు విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో రెండు రోజుల పాటు నిర్వహించి తలపెట్టిన పీఎం కిసాన్ సమ్మన్ సమ్మేళన్ 2022 సదస్సును సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు.
రెండు రోజులపాటు జరగనున్న ఈ సమావేశం వేదికగా ప్రధాని మోదీ 12వ విడత కిసాన్ సమ్మన్ స్కీము నిధుల పంపిణీ ప్రారంభిస్తారు. ఆ వెంటనే ఈ పథకం కింద లబ్ధిదారులైన రైతులందరికీ ఖాతాల్లోకి నగదు బదిలీ అవుతుంది.అంటే రేపటి నుంచి రైతుల ఖాతాల్లో డబ్బులు పడనున్నాయి.