మద్యం ప్రియులకు గుడ్ న్యూస్..డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఇకపై వాహనాలను సీజ్ చేసేదే లేదు..కానీ..

-

మద్యం మత్తులో డ్రైవింగ్ చేయకూడదూ అనేది రూల్..పోలీసులు కూడా ఇప్పటివరకూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేసే ఎన్నో వాహనాలు సీజ్ చేసారు. కానీ తెలంగాణ హైకోర్టు వాహనాల జప్తుపై కీలక ఆదేశాలు ఇచ్చింది. డ్రింక్ చేసి వాహనం నడిపితే సీజ్ చేసే అధికారం పోలీలుసులకు లేదని హైకోర్టు స్పష్టంగా చెప్పింది. ఈ విషయం మందుబాబులకు గుడ్ న్యూస్ హే మరి. అయితే ఇక్కడే ఉంది మరో ట్విస్ట్. మద్యం సేవించిన వ్యక్తి వాహనం నడిపేందుకు అనుమతిలేదు అని న్యాయస్థానం చెబుతూ..మద్యం తాగని మరో వ్యక్తి వాహనదారుడి వెంట ఉంటే అతడికి వాహనాన్ని అప్పిగించాలని తెలిపింది.

డ్రంక్ అండ్ డ్రైవ్ లో​ స్వాధీనం చేసుకున్న వాహనాన్ని ఒరిజనల్ రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ పాటు గుర్తింపుకార్డు చూపిన వ్యక్తికి స్వాధీనం చేయాలని ఆదేశిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. ఇటీవల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడితే వాహనాలను స్వాధీనం చేసుకోవడాన్ని సవాలు చేస్తూ సుమారు 43కు పైగా పిటిషన్లు దాఖలు అయ్యాయి..వీటిపై విచారించిన జస్టిస్ కె.లక్ష్మణ్ తీర్పు వెలువరించారు.

ఇప్పటివరకూ..

ఫుల్ గా తాగేసి డ్రైవ్ చేస్తే ప్రమాదాలు జరుగుతున్నాయని ట్రాఫిక్ పోలీసులు వారి వాహనాలను సీజ్ చేస్తూ వచ్చారు. ఒక్కసారి వెహికిల్ సీజ్ అయ్యింది అంటే..అది మళ్లీ మనం విడిపించుకోవటం పెద్ద పంచాయతీయే.. ఆ తర్వాత వాహనదారులు కోర్టు విచారణకు హజరై ఫైన్ కట్టి ఆపై ఆ వ్యక్తి కుటుంబ సభ్యుల ముందు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే జరిగే అనర్థాలపై కౌన్సిలింగ్ ఇస్తారు. ఇదంతా జరిగేందుకు కనీసం మూడు రోజులకు పైగా పడుతుంది. అప్పుడు గానీ వాహనాన్ని పోలీసులు తిరిగి ఇవ్వరు. ఏదో ఒక పెగ్ ఎక్కువ వేసినందుకు పొరపాటున బాభైల కంట్లో పడితే మందుబాబులు ఇన్ని అవస్థలు పడాల్సి వచ్చేది.

పోలీసుల తీరుపై చిర్రెత్తిపోయిన వాహనదారులు ఈ ప్రక్రియ వల్ల తాగి వాహనం నడపొద్దురా బాబూ అనే స్టేజ్ కి వచ్చేశారు. దీంతో హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలో ప్రమాదాల సంఖ్య కూడా బాగానే తగ్గింది. సరే ఇలా కొనసాగించకుండా పోలీసులు ఈ ఆంక్షలను మరింత కఠినతరం చేశారు. నగరంలోని ఓ కమిషనరేట్ పరిధిలో అయితే వాహనం పట్టుబడితే సుమారు 15 రోజులు పాటు వాహనం సీజ్​లో ఉంటుందని కొత్త రూల్ తీసుకొచ్చారు. అంతేఇక..అప్పటికే వీళ్లరూల్స్ తో మండిపడుతున్న వాహనదారులు ఈ అంశాలపై కోర్టును ఆశ్రయించారు. హైకోర్టుకు

ఇప్పటి వరకు 43కి పైగా పిటిషన్లు వచ్చాయి. వాటిని విచారించిన ధర్మాసనం.. ట్రాఫిక్ పోలీసులు వాహనం స్వాధీనానికి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేస్తూ అదేశాలిచ్చింది. మార్గదర్శకాలను అమలుచేయని పక్షంలో పోలీసులు కోర్టు ధిక్కరణను ఎదుర్కోవాల్సి ఉంటుందని న్యాయస్థానం హెచ్చరించింది కూడా.మోటారు వాహనాల చట్టం నిబంధనలు.. సుప్రీం కోర్టుతోపాటు ఇదే హైకోర్టు గతంలో వెలువరించిన పలు తీర్పులను ఆధారంగా చేసుకుని పోలీసులకు ఆదేశాలు జారీచేసింది.

ఇప్పటినుంచి…

వాహనం నడుపుతున్న వ్యక్తి మద్యం సేవించినట్లు తేలితే వాహనం నడపడానికి అనుమతిలేదు. అతనితోపాటు మద్యం సేవించని మరో వ్యక్తి ఉండి, అతనికి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నట్లయితే వాహనాన్ని సీజ్ చేయకుండా ఆ వ్యక్తి తీసుకునేలా పోలీసులు చూడాలి. ఒకవేళ మద్యం మత్తులో ఉన్న డ్రైవర్​ మినహా వాహనంలో ఎవరూ లేకపోతే.. సంబంధిత పోలీసు అధికారి.. వాహనం తీసుకెళ్లడానికి సమీపంలోని డ్రైవర్​ బంధువులు, స్నేహితులకు సమాచారం ఇవ్వాలట. ఇదేదో బాగుంది కదా అనుకుంటున్నారు మద్యంప్రియులు. పబ్ కి వెళ్తూ పక్కనే అమ్మాయి కచ్చితంగా ఎలా అయితే ఉండాలి అని రూల్ ఉందో..అలా ఇప్పుడు మనతో పాటు ఒక డ్రింక్ చేయని ఫ్రెండ్ ని కూడా తీసుకెళ్దాం అనుకుంటున్నారు మద్యంప్రియులు.

Read more RELATED
Recommended to you

Latest news