శకునం ప‌లికే పీకే : 60 ప్ర‌శ్న‌లు 600 స్లైడ్లు

-

ప్ర‌శాంత్ కిశోర్ అనే బీహారీ కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఆ విధంగా కాంగ్రెస్ ను బ‌లోపేతం చేసేందుకు ఆయ‌న ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు కూడా ! కాంగ్రెస్ పున‌రుత్థానానికి ఆయ‌న ఇక‌పై కృషి చేయ‌నున్నారు అని కూడా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఆయ‌న త‌ర‌ఫున కొన్ని ప్ర‌తిపాద‌న‌లు కూడా కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి వెళ్లాయి.దీంతో టెన్ జ‌న్ ప‌థ్ ఇక‌పై ప్ర‌శాంత్ కిశోర్ ప‌థ్ గా  మారిపోయిన ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. ఆ విధంగా ఆయ‌న త‌న వ్యూహాల‌ను పార్టీ త‌క్ష‌ణ అవ‌స‌రాల‌కూ, అభివృద్ధికీ అనుగుణంగా వాడుకోనున్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు పాత వ్యూహాలు వ‌దిలి కొత్త వ్యూహాల‌తో పార్టీ దిశ ను మార్చనున్నారు కూడా !

ఇప్ప‌టికే డీసీసీ కార్యాల‌యాలు చాలా మ‌నుగ‌డ‌లో ఉన్నా కూడా ఎందుకూ ప‌నికిరాకుండా ఏ కార్య‌క‌లాపాలూ చేయ‌కుండా కేవ‌లం ఆఫీసు నిర్వ‌హ‌ణ‌కే ప‌రిమితం అయి ఉన్నాయి. వైఎస్సార్ హ‌యాంలో ప్ర‌తి జిల్లాకూ సొంత డీసీసీ కార్యాల‌యం ఉండాల‌ని భావించి, ఆ విధంగా ఆయ‌న చొర‌వ‌చూపారు. డీసీసీ కార్యాల‌యాల నిర్వ‌హ‌ణ‌కు అనుగుణంగా  వాటికి అనుబంధంగా క‌ల్యాణ మండ‌పాలు మ‌రియు క‌మ‌ర్షియ‌ల్ షాపింగ్ కాంప్లెక్స్ లు క‌ట్టించి ఇచ్చారు. ఇవే ఇప్పుడు శ్రీ‌కాకుళం జిల్లా లాంటి మారుమూల ప్రాంతాల‌లో కూడా దిగ్విజ‌యంగా నడుస్తూ ఉన్నాయి. డీసీసీకి వైభ‌వం లేక‌పోయినా వీటి నుంచి వ‌చ్చే ఆదాయంతో సంబంధిత
కార్యాల‌యం నిర్విఘ్నంగా న‌డుస్తోంది.  ఇదే విధంగా చాలా చోట్ల వైఎస్సార్ లాంటి ముందు చూపు ఉన్న నేత‌లు పార్టీకి ఎంతో చేశారు. ఇప్పుడు పీకే  కూడా చెప్ప‌బోతున్న‌ది అదే ! పార్టీకి వీర‌విధేయులుగా ఉంటూ అహ‌ర‌హం పార్టీ ఉన్న‌తి కోసం ప‌రిశ్ర‌మించే వారికే ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టాల‌ని అదేవిధంగా వారి సేవ‌ల‌ను పూర్తి స్థాయిలో విస్తృత రీతిలో వినియోగించుకోవాల‌ని..
ఇందుకు సంబంధించి అధినేత్రి ఏ విధంగా ప‌నిచేయాలో కూడా పీకే ఇప్ప‌టికే ఓ ప్ర‌తిపాద‌న‌ను కూడా సిద్ధం చేసి అందుకు అనుగుణంగా పవ‌ర్ పాయింట్ ప్రెజెంటేష‌న్ ఇవ్వ‌నున్నారు. 600 స్లైడ్ల‌తో కూడిన ఈ డిజిట‌ల్ ప్ర‌జెంటేష‌న్ తో కాంగ్రెస్ అధినేత్రి
ఏ విధంగా మారబోతున్నారో అన్న‌దే ఆస‌క్తిక‌రం. అత్యంత ఆస‌క్తిక‌రం అని రాయాలి.

Read more RELATED
Recommended to you

Latest news