రైతు బాంధవుడు ప్రధాని మోడీ- సీఎం యోగి ఆదిత్యనాథ్

-

చెరకు రైతులకు సరసమైన మరియు గిట్టుబాటు ధర (ఎఫ్‌ఆర్‌పి)ని పెంచుతూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.దీనికి గాను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. చెరకు రైతుల స్వావలంబన శ్రేయస్సు కోసం సాగే ప్రయాణంలో ఈ నిర్ణయం మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని ఆయన అభివర్ణించారు.ఈ మేరకు ట్విటర్‌లో ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. మోడీ నాయకత్వంలో 2023-24 చక్కెర సీజన్‌లో చెరకు రైతులకు అత్యధికంగా ధరను అందించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడాన్ని ఆయన కొనియాడారు.సరసమైన మరియు లాభదాయక ధర (ఎఫ్‌ఆర్‌పి)ని క్వింటాల్‌కు ₹ 315కి ఆమోదించడం చాలా అభినందనీయమని ఈ నిర్ణయం చెరుకు రైతుల స్వావలంబనకు వారి శ్రేయస్సుకు దోహదం చేస్తుందని యోగి పేర్కొన్నారు.

2023-24 సీజన్‌లో చెరుకు సరసమైన మరియు లాభదాయక ధర (ఎఫ్‌ఆర్‌పి) క్వింటాల్‌కు రూ.315కి పెరిగింది. ఇప్పటివరకు చెరకు కొనుగోలుకు ఇదే అత్యధిక ధర. దీంతో దేశంలోని చెరకు రైతులకే కాకుండా వారి ఉత్పత్తులకు మంచి ధర లభించనుంది. దీంతో పాటు చక్కెర కర్మాగారాల్లో పనిచేస్తున్న కార్మికులకు కూడా లబ్ధి చేకూరనుంది. ఈ నిర్ణయంతో దాదాపు 5 కోట్ల మంది చెరకు రైతులు, చక్కెర కర్మాగారాల్లో పనిచేస్తున్న లక్షలాది మంది కార్మికులకు లబ్ధి చేకూరనుంది.

YOGI

దీంతోపాటు రైతులకు యూరియా అందుబాటులో ఉండేలా యూరియా సబ్సిడీ పథకాన్ని కొనసాగించేందుకు మోదీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్యాకేజీలో, మూడు సంవత్సరాల (2023 నుండి 2025 వరకు) యూరియా సబ్సిడీకి సుమారు రూ. 3.70 లక్షల కోట్లు కేటాయించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రైతులు యూరియా సేకరణకు అదనంగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు.అంటే రైతులు పెట్టుబడిని తగ్గించుకునే అవకాశం ఉంది. యూరియా సబ్సిడీ పథకం కొనసాగింపుతో దేశీయంగా యూరియా ఉత్పత్తి కూడా గరిష్టంగా పెరిగే సూచనలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news