మరో రెండు వందేభారత్ రైళ్లని ప్రారంభించిన ప్రధాని మోదీ

-

దేశంలో వందే భారత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ఇప్పటికే ఎనిమిది వందే భారత్ రైళ్లు పలుమార్గాలలో ప్రారంభించగా.. తాజాగా శుక్రవారం మరో రెండు వందే భారత్ రైళ్లను ప్రధాని మోదీ ప్రారంభించారు. ముంబై – సోలాపూర్, ముంబై – షిరిడి 2 రైళ్లను ప్రధాని మోదీ నేడు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తో పాటు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ హాజరయ్యారు.

ఇదే క్రమంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపన చేశారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. 17 రాష్ట్రాలలోనూ 108 జిల్లాలు ఈ రైళ్ల ద్వారా అనుసంధానం అవుతాయని చెప్పారు. ఇకపై ముంబై ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా సాఫీగా ప్రయాణించవచ్చని అన్నారు. ఇప్పటివరకు మొత్తంగా 10 రైళ్ళను లాంచ్ చేసింది కేంద్రం. ప్రజా రవాణా వ్యవస్థలో అత్యంత వేగంగా మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు ప్రధాని.

Read more RELATED
Recommended to you

Latest news