గూగుల్ మ్యాప్‌ల సాయంతో మంత్రి కేటీఆర్ రాష్ట్ర ప్రగతిని వివరించారు. కొత్తగా ఏర్పాటైన పరిశ్రమల చిత్రాలను అసెంబ్లీలో ప్రదర్శించారు. ఐటీ రంగంలో హైదరాబాద్ బెంగళూరుకు గట్టి పోటీ ఇస్తోందని తెలిపారు. 2014లో హైదరాబాద్‌లో 3.23 లక్షల ఐటీ ఉద్యోగులు ఉన్నారని వెల్లిడంచారు. ఇప్పుడు హైదరాబాద్‌లో 8.70 లక్షల ఐటీ ఉద్యోగులు ఉన్నారని చెప్పారు.
‘గతేడాది దేశంలో ఐటీలో 4.50 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. 4.50 లక్షల ఉద్యోగాల్లో మన వాటా లక్షన్నర ఉద్యోగాలు. ఐటీలో కొత్త ఉద్యోగాల్లో హైదరాబాద్ బెంగళూరును దాటింది. సుల్తాన్‌పూర్‌లో ఆసియాలోనే అతి పెద్ద స్టంట్ పరిశ్రమ నెలకొంది.’ అని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు.