ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో రెండే రెండు రాష్ట్రాలు కీలకం అవుతున్నాయి. ఒకటి ఉత్తర ప్రదేశ్ కాగా రెండు పంజాబ్. పంజాబ్ ఎన్నికలు రేపు సింగిల్ ఫేజ్ లో జరగనున్నాయి. సంత్ రవికాంత్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఫిబ్రవరి 14న జరగాల్సిన ఎన్నికలను వాయిదా వేశారు.దీంతో ఈ నెల 20న మార్పులకు అనుగుణంగా షెడ్యూల్ అనుసారం ఎన్నికలు అక్కడ జరగనున్నాయి. మొత్తం 117 స్థానాలకు ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి.ఇక యూపీలో ఇప్పటికే రెండు విడతల్లో పోలింగ్ పూర్తయింది.రేపు మూడో విడత పోలింగ్ కు సంబంధిత యంత్రాంగం సన్నద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు ఓవైపు జరుగుతుండగానే మరోవైపు ప్రధాని మాత్రం ఇందుకు విరుద్ధంగా అంతః ప్రవాహ సూత్రంలో భాగంగా ఆయన చొచ్చుకుపోతున్నారు.ఓటర్లను ప్రత్యక్ష మరియు పరోక్ష విధానంలో ఆకర్షిస్తూ ఉన్నారు.దీంతో అటు దళిత ఓట్లు ఇటు మైనార్టీ ఓట్లకు సంబంధించి బీజేపీ ఆకర్షణ సూత్రాలను పాటిస్తూ ఉంది.
మొన్నటి వేళ సంత్ రవిదాస్ జయంతి వేడుకలను తమకు అనుగుణంగా మార్చుకునేందుకు వారణాసికి వెళ్లిన యువ నేత రాహుల్ తో పోటీపడుతూ ఢిల్లీ కేంద్రంగా ఉన్న కరోల్ బాగ్ కు చేరుకుని సంబంధిత వర్గాలను చేరువ చేసుకునేందుకు మోడీ తనవంతు ప్రయత్నాలు బాగానే చేశారు. భజనల్లో పాల్గొన్నారు. వారితో కలిసి మెలిసి నాలుగు మాటలు చెప్పి వచ్చారు. ఉత్తర ప్రదేశ్ లోనూ, అదేవిధంగా పంజాబ్ లోనూ దళితుల ఓట్లను ఒకప్పుడు బీఎస్పీ లాంటి ప్రాంతీయ పార్టీ కొల్లగొట్టగా ఇప్పుడు బీజేపీ తనదైన రాజకీయంలో భాగంగా ఆ ఓట్లన్నింటినీ గంపగుత్తగా తన ఖాతాలో వేసుకునేందుకు సన్నద్ధం అవుతోంది. యోగీ కన్నా మోడీ యే ఎక్కువగా ఈ ఎన్నికల విషయమై కాస్తో కూస్తో ఎక్కువ టెన్షన్ పడుతున్నారు.ఇదే సందర్భంలో సిక్కులతో నిన్నటి వేళ ఢిల్లీలో తన నివాసంలో సమావేశం అయ్యారు. దేశ కీర్తినీ, సంస్కృతినీ పరివ్యాప్తం చేయడంలో సిక్కులు ముందున్నారు అని కొనియాడారు.తద్వారా సంబంధిత వర్గాలను బాగానే ఆకట్టుకున్నారు మోడీ.ఇవన్నీ రేపటి వేళ ఏ విధంగా సత్ఫలితాలు ఇస్తాయో అన్నది ఆసక్తిదాయకం.