ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. బిల్కిస్ బానో రేపిస్టులకు మోదీ అండగా ఉంటున్నారని ఆరోపించారు. బిల్కిస్ బానో రేపిస్టుల విడుదల విషయంలో కేంద్రం, గుజరాత్ ప్రభుత్వం తొందరపడినట్లు తాజాగా ఓ నివేదిక రిలీజైన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆ నివేదికపై రాహుల్ గాంధీ స్పందించారు. మహిళలను గౌరవించాలని ప్రధాని మోదీ ఎర్రకోటలో ప్రసంగించారని, కానీ వాస్తవంగా.. ఆయన రేపిస్టులకు సానుకూలంగా ఉన్నారని రాహుల్ తన ట్వీట్లో ఆరోపించారు. ప్రధాని చేసిన ప్రామిస్, ఆయన ఉద్దేశం మధ్య తేడా ఉందని రాహుల్ అన్నారు. మహిళలను మోదీ మోసం చేశారని రాహుల్ విమర్శించారు.
బిల్కిస్ బానో రేప్ కేసులో నిందితులైన 11 మందిని కొన్ని నెలల క్రితం విడుదల చేశారు. ఆ సమయంలో వాళ్లను గౌరవించారు. 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానో అత్యాచారానికి గురైంది. నిందితుల్ని రిలీజ్ చేయవద్దు అని సీబీఐ తన నివేదికలో చెప్పినా.. కేంద్రం పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి.
लाल किले से महिला सम्मान की बात लेकिन असलियत में 'बलात्कारियों' का साथ।
प्रधानमंत्री के वादे और इरादे में अंतर साफ है, PM ने महिलाओं के साथ सिर्फ छल किया है।
— Rahul Gandhi (@RahulGandhi) October 18, 2022