శ్రీశైలం జలశయానికి భారీగా వరద.. 9 గేట్లు ఎత్తివేత

-

తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అయితే.. దీంతో.. శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్ట్ 9 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. స్పిల్‌ వే ద్వారా 2.25 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. జూరాల, సుంకేశుల, హంద్రీ నుంచి శ్రీశైలానికి 3.45 లక్షల క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Srisailam Dam - All You Need to Know BEFORE You Go (with Photos)

ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు 884.60 అడుగల వరకు నీరు ఉంది. పూర్తి నీటి నిల్వ 215.80 టీఎంసీలకు గాను 213.40 టీఎంసీల నీరు నిల్వ ఉందని తెలిపారు. కుడి, ఎడమ జల విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేసిన 65,961 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణలోని ప్రాజెక్టులకు సైతం వరద నీరు పోటెత్తుతోంది. దీంతో రిజర్వాయర్‌లు నిండుకుండల్లా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news