మూడో రోజు ఈడీ విచారణకు హాజరు కానున్న రాహుల్ గాంధీ

-

నేషనల్ హెరాల్డ్ మనీ ల్యాండరింగ్ కేసులో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మూడోరోజు ఈడి ముందు హాజరు కానున్నారు. రెండు రోజుల్లో 20 గంటలపాటు రాహుల్ గాంధీ ని ప్రశ్నించిన ఈడి అధికారులకు రాహుల్ నుంచి సరైన సమాధానాలు లభించలేదు. పిఎమ్ఎల్ఏ సెక్షన్ 50 కింద రాహుల్ గాంధీ స్టేట్మెంట్ను ఈడీ అధికారులు రికార్డు చేస్తున్నారు. బ్యాంకు లావాదేవీలు, ఆర్థిక లావాదేవీల గురించి సరైన సమాధానాలు రాహుల్ గాంధీ ఇవ్వడం లేదని ఈడీ వర్గాల సమాచారం.

- Advertisement -

కాగా రాహుల్ గాంధీకి మద్దతుగా ఈరోజు కూడా కాంగ్రెస్ శ్రేణులు ఢిల్లీలో ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు తెలంగాణలో కూడా టిపిసిసి నిరసన ప్రదర్శనలు నిర్వహించేందుకు సన్నద్ధమైంది. తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఉదయం 10 గంటలకు అందరూ గాంధీ భవన్ కు చేరుకోవాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈడీ రాహుల్ గాంధీని విచారించినంతకాలం తమ నిరసన కొనసాగుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...